KMM: ఇందిరమ్మ ఇండ్ల పథకం మొదటి విడత లబ్ధిదారుల ఎంపికను అధికారులు పారదర్శకంగా పూర్తి చేయాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అన్నారు. మంగళవారం మంత్రి పొంగులేటి ఇందిరమ్మ ఇళ్లు, భూ భారతిపై జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ఖమ్మం జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ పాల్గొన్నారు. నిరుపేదలకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.