CTR: జర్నలిస్టులు ఎన్నోవ్యయ ప్రయాసలకోర్చి నిస్వార్ధమైన సేవలు అందిస్తున్నారని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. చిత్తూరు జడ్పీ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన ఏపీ డబ్ల్యూజేఎఫ్ 4 మహాసభలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జర్నలిస్టుల పిల్లల విద్యాభివృద్ధికి రూ.2లక్షల విరాళాన్ని ప్రకటించారు. జర్నలిస్టు సమస్యల పరిష్కారానికి ఎల్లవేళలా కృషి చేస్తాన్నన్నారు.