VZM: జాతీయ ఆహార భద్రత పథకంలో భాగంగా జామి మండలంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో పంపిణీ చేసిన నూర్పిడి యంత్రాలను అధికారులు మంగళవారం పరిశీలించారు. కుమరాం, అట్టాడ, జామి గ్రామాల్లో రైతులు వినియోగిస్తున్న యంత్రాలను వ్యవసాయ సహాయ సంచాలకులు కళ్యాణ్ కుమార్, గుంటూరు వ్యవసాయ అధికారి లక్ష్మిరెడ్డి పరిశీలించారు. యంత్రాలు పనితీరు, రాయితీ వివరాలను అడిగి తెలుసుకున్నారు.