గుజరాత్ టైటాన్స్ ప్లేయర్ సాయి సుదర్శన్ తన బ్యాటింగ్‌తో ‘Mr.CONSISTENT’గా మారాడు. ఈ సీజన్లో తను ఆడిన 8 మ్యాచ్‌ల్లో 5 అర్థ సెంచరీలు సాధించాడు. 417 పరుగులతో ఆరెంజ్ క్యాప్ దక్కించుకున్నాడు. ప్రతి మ్యాచ్‌లోనూ బాధ్యతాయుతంగా ఆడుతూ జట్టుకు మంచి ఆరంభాన్ని ఇస్తున్నాడు. అతడు ఇలాగే రాణిస్తే త్వరలో టీమిండియాలో స్థానం సంపాదించే అవకాశం ఉంది.