ఈడెన్ గార్డెన్స్ వేదికగా KKRతో జరిగిన మ్యాచ్లో గుజరాత్ 39 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. 199 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్కతా 8 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. గుర్బాజ్ (1), నరైన్ (17), వెంకటేశ్ అయ్యర్ (14) నిరాశపరిచారు. రహానె (50), రఘువన్షి (27*) ఆకట్టుకున్నారు. గుజరాత్ బౌలర్లలో ప్రసిధ్ కృష్ణ, రషీద్ ఖాన్ చెరో రెండు వికెట్లు తీశారు.