చెన్నై సూపర్ కింగ్స్ వరుస పరాజయాలతో ప్లే ఆఫ్స్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. ఇప్పటివరకు ఆడిన 8 మ్యాచ్ల్లో కేవలం 2 విజయాలు మాత్రమే సాధించి.. 4 పాయింట్లతో చివరిస్థానంలో ఉంది. అయినప్పటికీ CSKకు ఇంకా ప్లే ఆఫ్స్ అవకాశాలు ఉన్నాయి. మిగిలిన 6 మ్యాచ్లు గెలిస్తే 16 పాయింట్లతో ఫ్లే ఆఫ్స్ చేరే అవకాశం ఉంది. ఒక్క మ్యాచ్ ఓడినా CSK కథ ముగుస్తుంది.