ASF: లింగాపూర్ మండల కేంద్రంలోని పలు వీధుల్లో చెత్త పేరుకుపోయి దుర్గంధం వస్తుందని స్థానికులు వాపోతున్నారు. గత కొన్ని రోజులుగా చెత్తను తొలగించకపోవడంతో దోమలు బెడద పెరిగిందని పేర్కొంటున్నారు. దీంతో వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి చెత్తను తొలగించాలని కోరుతున్నారు.