ఉత్తరాఖండ్‌లో దారుణం చోటు చేసుకుంది. కాశీపూర్‌కు చెందిన హర్జిందర్ కౌర్ అనే మహిళ ఆడబిడ్డకు జన్మనిచ్చిందని ఆమె భర్త దాడికి పాల్పడ్డాడు. స్క్రూ డ్రైవర్‌తో పొడిచి తనను కొట్టాడని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. కట్నంగా రూ.5 లక్షల నగదు, బంగారం తీసుకురావాలని అత్తమామలు, భర్త డిమాండ్ చేశారని ఆరోపించింది.