NDL: జూపాడు బంగ్లా మండలం, తర్తూరులో వెలిసిన శ్రీ లక్ష్మీ రంగనాథ స్వామిని మాజీ ఎమ్మెల్యే వైసీపీ సీనియర్ నాయకులు లబ్బి వెంకట స్వామి ఆదివారం దర్శించుకున్నారు. ఆలయ ఈవో సాయి కుమార్, పూజారులు, ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి, స్వామి అమ్మ వార్లకు పూజలు చేయించి, తీర్థప్రసాదాలు, ఆశీర్వచనాలు అందించారు. కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు.