GNTR: అమరావతి రాజధాని ప్రాంతానికి PM మోదీ ఈనెలలో రానున్నారు. ఈ నేపథ్యంలో గుంటూరు SP సతీశ్ గురువారం వెలగపూడి సచివాలయం సమీపంలో హెలిప్యాడ్లు ఏర్పాటు చేసే ప్రాంతాన్ని పరిశీలించారు. ఈ మేరకు స్థానిక అధికారులకు పలు సూచనలు చేశారు. కాగా మోదీ రాక కోసం మూడు హెలిప్యాడ్లు ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు పాల్గొన్నారు.