GNTR: మంత్రి గుమ్మడి సంధ్యారాణి శుక్రవారం గుంటూరులో పర్యటించనున్నారు. ఈ మేరకు మహిళా ప్రాంగణంలో నూతనంగా ఏర్పాటు చేసిన వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ని మంత్రి ప్రారంభిస్తారు. అదే విధంగా మహిళ అభివృద్ధి, శిశు సంక్షేమంపై అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. మంత్రి గుమ్మడి సంధ్యారాణి పర్యటన నేపథ్యంలో అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు.