PLD: వినుకొండలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహానికి మానవ సేవా సమితి సభ్యులు అంతక్రియలు చేసి మానవత్వం చాటుకున్నారు. పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో అనాధ శవానికి అంతక్రియలు చేసేందుకు మాజీ కౌన్సిలర్, రాష్ట్రపతి అవార్డు గ్రహీత, మానవ సేవా సమితి అధ్యక్షుడు పీవీ సురేశ్ బాబు ఆధ్వర్యంలో హెల్పింగ్ హార్డ్ సంస్థ సభ్యులు ముందుకొచారు.