MBNR: ఉరేసుకొని ఓ యువకుడు మృతి చెందిన సంఘటన బాలానగర్ మండల కేంద్రంలో శుక్రవారం తెల్లవారుజామున జరిగింది. స్థానికుల వివరాలు ప్రకారం.. గురుకుల పాఠశాల సమీపంలో ఉండే మణిదీప్ (18) ఉదయం పూట పేపర్ బాయ్‌గా పని చేస్తూ.. బీఎస్సీ నర్సింగ్ చదువుతున్నాడు. ఏమైందో కారణం తెలియదు కానీ.. ఈరోజు తెల్లవారుజామున ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.