JGL: ట్రాఫిక్ నియంత్రణలో భాగంగా మెట్ పల్లి పట్టణంలోని రెండు కూడళ్లలో అధికారులు లక్షలు ఖర్చు చేసి ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటు చేశారు. సిగ్నల్ పోల్కు ఓ లారీ తగలడంతో రోడ్డుపై పడిపోయింది. దీంతో గత కొన్ని నెలలుగా ట్రాఫిక్ సిగ్నల్స్ పనిచేయకపోవడంతో పట్టణంలో ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది. అధికారులు సిగ్నల్ లైట్లను పునరుద్ధరించాలని పట్టణ ప్రజలు కోరారు.