HNK: జిల్లా కలెక్టరేట్ కార్యాలయ సమావేశ మందిరంలో నేడు మాదక ద్రవ్యాల వినియోగంపై సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. జిల్లాలో మాదకద్రవ్యాల నివారణకు అనుసరించాల్సిన వ్యూహంపై అధికారులు సమీక్షించారు. యువతను చైతన్యవంతం చేస్తూ ముద్రించిన వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. డీసీపీ సలీమా, జిల్లా రెవెన్యూ అధికారి గణేష్, ఎక్సైజ్ అధికారులు పాల్గొన్నారు.