TG: ఆరు గ్యారెంటీలకు రూ.56వేల కోట్లు ఖర్చు చేస్తున్నామని అసెంబ్లీలో భట్టి విక్రమార్క తెలిపారు. గతంలో ఇసుకపై రోజుకు కోటీన్నర ఆదాయం వస్తే.. ప్రస్తుతం రూ.3కోట్లు వస్తుందన్నారు. తమ ప్రభుత్వం 57వేల ఉద్యోగాలు ఇచ్చిందన్నారు. గతంలో ఆదాయం పెరుగుతుందో లేదో చూసుకోకుండా బడ్జెట్ పెంచుకుంటూ పోయారని.. శాసనసభ ఆమోదం లేకుండా రూ.2.30 లక్షల కోట్లు BRS ఖర్చు చేసిందని భట్టి విమర్శించారు.