నటి కాజల్ అగర్వాల్ (Actress Kajal Aggarwal) దక్షిణాది పరిశ్రమలో (South Industry) మంచి పేరు సంపాదించుకున్నది. తెలుగు (Tollywood), తమిళ్(Kollywood) భాషా చిత్రాలలో పని చేసింది. ఆమె హిందీ చిత్ర పరిశ్రమలో (bollywood) కూడా భాగమైంది. బాలీవుడ్ చిత్రంతో (Bollywood film) హిందీలోకి (hindi film) ఎంట్రీ ఇచ్చింది. స్పెషల్ 26లో (Special 26) ఆమె నటన పట్ల అందరూ మంత్ర ముగ్ధులయ్యారు. అయితే ఇప్పుడు సదరు నటి బాలీవుడ్లో కాకుండా దక్షిణాదిన పని చేయడానికి ఎందుకు ఇష్టపడుతున్నట్లు చెప్పారు. కాజల్ సౌత్ సినిమా (South film) వర్సెస్ బాలీవుడ్ (bollywood సినిమా గురించి ఓ టీవీ కార్యక్రమంలో మాట్లాడారు. బాలీవుడ్ కంటే సౌత్ ఇండస్ట్రీలో పని చేయడానికి తాను ఇష్టపడతానని వెల్లడించింది. హిందీ తన మాతృభాష అని, హిందీ సినిమాలు చూస్తూనే పెరిగానని, దానిని ఎవరూ కాదనలేరని, తనకు కూడా హిందీ పట్ల మక్కువ ఉందని, కానీ దక్షిణ పరిశ్రమలో ఉన్న విలువలు, వాతావరణం, నైతికత, క్రమశిక్షణను తాను ఇష్టపడతానని చెప్పారు. ఇవి హిందీ సినిమాలో లోపించిందని తాను భావిస్తున్నట్లు చెప్పారు. సౌత్ పరిశ్రమ గురించి ఆమె గొప్పగా మాట్లాడారు.
తన కెరీర్ దక్షిణాదినే ప్రారంభమైందని, హైదరాబాద్ లోనే మొదట పని చేశానని, తాను ఎక్కువగా చేసింది కూడా తెలుగు, తమిళ సినిమాల్లోనే అని చెప్పారు. బాలీవుడ్ లో కొన్ని సినిమాలు చేసినప్పటికీ హైదరాబాద్, చెన్నై నగరాలను నివాసంగా భావిస్తానని చెప్పారు. అది ఎప్పటికీ మారదన్నారు. దక్షిణాదిన స్నేహ పూర్వక వాతావరణం ఉంటుందని, టాలెంట్ ఉంటే ప్రేక్షకులు ఆదరిస్తారన్నారు. మంచి దర్శకులు, టెక్నిషియన్స్ ఉన్నట్లు చెప్పారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో మంచి కంటెంట్ వస్తుందన్నారు. విజయానికి సులభమైన మార్గం లేదని కూడా చెప్పారు. దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన భాష హిందీ కావడంతో తమ వృత్తిని బాలీవుడ్ నుండి ప్రారంభించాలని చాలామంది అనుకుంటారని చెప్పారు. ఇది ఆమోద యోగ్యమే కానీ, దక్షిణాదిన అద్భుత టెక్నిషియన్లు, దర్శకులు ఉన్నారన్నారు. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ నాలుగు భాషల్లో రూపొందించిన అద్భుతమైన కంటెంట్ ఉంటుందన్నారు. కాజల్ వ్యాఖ్యలు పరిశ్రమలో చర్చనీయాంశంగా మారాయి.