TG: గత ప్రభుత్వ పాలనలో ఛిద్రమైన ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడుతున్నామని ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క అన్నారు. తాత్కాలిక, దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని పనిచేస్తున్నామన్నారు. తెలంగాణ ప్రజలు తమని నమ్మి అధికారం కట్టబెట్టినందుకు.. వారికి జవాబుదారీతనంగా ఉంటూ పాలన సాగిస్తున్నామన్నారు. అయినా తమపై నిరాధారమైన ఆరోపణలు చేయడమే.. కొంతమంది పనిగా పెట్టుకున్నారని విమర్శించారు.