ADB: ఉట్నూర్ మండల కేంద్రంలోని శాంతినగర్‌కు చెందిన నాతోరి రవీందర్ ప్రభుత్వం విడుదల చేసిన HWO ఫలితాల్లో ప్రతిభ కనబర్చారు. రాష్ట్ర స్థాయిలో 9వ ర్యాంకును సాధించి అందరి మన్ననలు పొందారు. రవీందర్ ఉట్నూర్ కీబీ ప్రాంగణంలోని ప్రభుత్వ పీఈటీసీ లైబ్రరీలో చదివి ఉద్యోగం సాధించారు. రవీందరు పీఈటీసీ ప్రిన్సిపల్ మెస్రం మనోహర్, తోటి విద్యార్థులు అభినందించారు.