సుదీర్ఘ కాలం అంతరిక్షంలో ఉన్న వ్యోమగామి సునీతా విలియమ్స్ క్షేమంగా భూమిపైకి చేరుకున్నారు. 9 నెలల తర్వాత ఆమె రోదసి నుంచి తిరిగి రావటంపై భారత్లోని ఆమె కుటుంబసభ్యులు, బంధువులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆమె బంధువు ఒకరు మీడియాతో మాట్లాడుతూ.. సునీతా త్వరలోనే ఇండియాకు వస్తారని తెలిపారు. ఆమె సురక్షితంగా భూమిపై ల్యాండ్ అవటం సంతోషాన్నిచ్చిందన్నారు.