పల్నాడు: వెల్దుర్తి మండలం గుండ్లపాడుకు చెందిన టీడీపీ కార్యకర్త తోట చంద్రయ్య హత్య కేసును ప్రభుత్వం సీఐడీకి అప్పగించింది. ఈ సందర్భంగా హోం మంత్రికి, ప్రభుత్వానికి, మాచెర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి అసెంబ్లీలో ధన్యవాదాలు తెలిపారు. గత ప్రభుత్వంలో పోలీస్ శాఖ పూర్తిగా విఫలం అయ్యిందన్నారు. పల్నాడుకు పట్టిన శనిని వదిలించారని పేర్కొన్నారు.