»Fear Of Layoffs Software Engineer Committed To Suicide In Hyderabad
Layoffs భయం.. ఒత్తిడి భరించలేక టెకీ బలవన్మరణం
లేఆఫ్ లు (Lay offs) ప్రకటిస్తున్న వేళ తన ఉద్యోగం (Job) కూడా ఊడిపోతుందని ఆందోళన చెందుతుండేవాడు. ఒత్తిడిని టెకీలు జయించలేక ఇలాంటి దారుణాలకు పాల్పడుతుండడంతో బాధిత కుటుంబాలు తీరని శోకంలో మునుగుతున్నాయి.
సాఫ్ట్ వేర్ రంగంలో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. ఆర్థిక భారాన్ని తగ్గించుకునేందుకు కంపెనీలు పెద్ద ఎత్తున ఉద్యోగాల కోతలకు పాల్పడుతున్నాయి. దీంతో ఎప్పుడూ ఎవరి ఉద్యోగం పోతుందనే భయంతో సాఫ్ట్ వేర్ ఉద్యోగులు (Software Engineer) ఉన్నారు. ఈ భయంతో జాగ్రత్తగా.. అధిక సమయమైనా ఉద్యోగం చేస్తున్నారు. దీంతో టెకీలు ఆందోళనకు లోనవుతున్నారు. ఇదే భయంతో ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన హైదరాబాద్ (Hyderabad) శివారు నార్సింగిలో (Narsingi) చోటుచేసుకుంది.
ఏపీలోని గుంటూరు జిల్లాకు (Guntur District) చెందిన వినోద్ కుమార్ (30) హైదరాబాద్ లోని ఓ కంపెనీలో సాఫ్ట్ వేర్ ఉద్యోగిగా పని చేస్తున్నాడు. పుప్పాల్ గూడలో (Puppalguda) నివసిస్తూ ఉద్యోగానికి వెళ్తున్నాడు. అయితే ఉద్యోగం విషయంలో ఒత్తిడికి (Stress) లోనవుతున్నాడు. కొన్ని రోజులుగా మానసికంగా ఇబ్బంది పడుతున్నాడు. లేఆఫ్ లు (Layoffs) ప్రకటిస్తున్న వేళ తన ఉద్యోగం (Job) కూడా ఊడిపోతుందని ఆందోళన చెందుతుండేవాడు. ఇదే బాధతో మనస్తాపానికి గురైన వినోద్ గురువారం ఇంట్లో ఫ్యాన్ కు ఉరేసుకుని ప్రాణం తీసుకున్నాడు.
కాగా అతడికి ఐదేళ్ల కిందట వివాహమైంది (Marriage). వారి కాపురంలో ఎలాంటి కలహాలు లేవు. భార్యాభర్తలు ఇద్దరు అన్యోన్యంగా ఉంటున్నారు. ఉద్యోగం ఒత్తిడితోనే వినోద్ బలవన్మరణానికి పాల్పడ్డాడని తెలుస్తున్నది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా ఒత్తిడిని టెకీలు జయించలేక ఇలాంటి దారుణాలకు పాల్పడుతుండడంతో బాధిత కుటుంబాలు తీరని శోకంలో మునుగుతున్నాయి.