MBNR: నవాబుపేట మండల కేంద్రంలో ఆదివారం మధ్యాహ్నం 12:30 గంటలకు ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్ రెడ్డి 70 మంది రైతులకు స్ప్రింక్లర్ యూనిట్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం 1:30 గంటలకు మండలంలోని దేపల్లె గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి భూమి పూజ చేస్తారని ఎమ్మెల్యే వ్యక్తిగత కార్యదర్శి బాలు తెలిపారు.