BDK: జాతీయ ఆరోగ్య మిషన్లో వైద్యాధికారుల పోస్టుల భర్తీ కొరకు ఇటీవల విడుదల చేసిన మెరిట్ జాబితాలో ఏవైనా అభ్యంతరాలు ఉంటే ఈనెల 10వ తేదీలోగా రాతపూర్వకంగా తెలియజేయాలని డా.భాస్కర్ నాయక్ శనివారం ఒక ప్రకటనలో కోరారు. అభ్యర్థులు సంబంధిత వివరాలతో నిర్దిష్ట ఫార్మాట్లో సమర్పించాలన్నారు. పూర్తి వివరాలకు అధికార వెబ్సైట్ చూడాలని కోరారు.