కృష్ణా: డబ్బులు ఇవ్వలేదని విజయవాడకు చెందిన మహిళను కిడ్నాప్ చేసిన ఘటన గుంటూరులో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. శేఖర్ అనే వ్యక్తి గుంటూరుకు చెందిన నర్సారెడ్డి దగ్గర అప్పు తీసుకున్నాడు. ఆర్థిక పరిస్థితులు బాగోలేక శేఖర్ కుటుంబం విజయవాడలో ఉంటున్నారు. డబ్బులు ఇవ్వటం లేదని నర్సారెడ్డి శేఖర్ భార్యను కిడ్నాప్ చేశాడు.