SKLM: కవిటి మండలం దూగాన పుట్టుగ గ్రామానికి చెందిన అన్నదమ్ములు దూగాన తులసీదాస్, దుగాన చంద్రశేఖర్ 15 రోజులు వ్యవధిలో మరణించారు. అనారోగ్య కారణాలతో తులసీదాస్ ఫిబ్రవరి 11న మరణించగా.. 15 రోజులకు మహా శివరాత్రి (ఫిబ్రవరి 26) రోజున అన్న చంద్రశేఖర్ మరణించారు. అన్నదమ్ముల మరణం పట్ల పలువురు సంతాపం వ్యక్తం చేశారు. కాగా వారికి నేడు పెద్దకర్మ.