కృష్ణా: మహిళా దినోత్సవం సందర్భంగా సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి శనివారం విజయవాడలో ‘ది అసోసియేషన్ ఆఫ్ లేడీ ఎంటర్‌ప్రెన్యూర్స్ అఫ్ ఇండియా'(ALEAP) సదస్సులో పాల్గొన్నారు. మహిళలు సమాజాన్ని ముందుకు నడిపించి ప్రోత్సహిస్తున్నారన్నారు. దేశం నలుమూలలా మహిళలు ఒడిదుడుకులు అధిగమించి సాధికారత దిశగా ముందుకెళ్లడం అభివృద్ధికి కొలమానం అన్నారు.