కృష్ణా: మాజీ మంత్రి, వైసీపీ నేత పేర్ని నానికి హైకోర్టులో ఊరట లభించింది. శుక్రవారం హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. రేషన్ బియ్యం మిస్సింగ్ కేసులో ఏ 6గా పేర్ని నాని ఉన్నారు. ఇదిలా ఉండగా ఇటీవల పలుమార్లు టీడీపీ నేతలు త్వరలోనే పేర్ని నాని అరెస్ట్ కాబోతున్నారని వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో హైకోర్టు ముందస్తు బెయిల్ ఇచ్చింది.