AKP: మాకవరపాలెం మండలం జంగాలపల్లి గ్రామంలో భారీ ఎత్తున కోట్ల రూపాయల విలువ చేసే ఇసుక అక్రమ రవాణా అరికట్టాలని కోరుతూ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఓబీసీ చైర్మన్ బొంతు రమణ ఆర్డిఓ వివి రమణకు వినతిపత్రం అందజేశారు. 30 ఎకరాల్లో ఇసుక మేటలు ప్రభుత్వ భూముల్లో ఉన్నాయి అన్నారు. అయితే అనుమతులు లేకుండా కొంతమంది అక్రమార్కులు ఇసుకను దొంగతనంగా అవుతున్నారన్నారు.