బాపట్ల: కుల దూషణపై వేమూరు పోలీస్ స్టేషన్లో కేసు నమోదైనట్లు ఎస్సై రవికృష్ణ తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల మేరకు.. చదలవాడ గ్రామానికి చెందిన గుంటూరు విజయ కుమారిని చక్రాయపాలెం గ్రామానికి చెందిన ఉమా శంకర్ వేధింపులకు గురిచేస్తూ, కులం పేరుతో దూషిస్తున్నట్లు ఆమె ఫిర్యాదు చేసిందన్నారు. దీంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.