బాపట్ల: వేటపాలెం మండలం కటారి వారి పాలెం తీరంలో చీరాలకు చెందిన యువతని అదే ప్రాంతానికి చెందిన పూజేష్ అనే యువకుడు ప్రేమించడం లేదని వేధిస్తూ హత్య చేయటానికి ప్రయత్నించాడని ఆమె కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు గురువారం అతన్ని అరెస్టు చేసినట్లు ఎస్సై వెంకటేశ్వర్లు చెప్పారు. అతన్ని న్యాయస్థానంలో హాజరపరచగా న్యాయమూర్తి రిమాండ్ విధించినట్లు ఎస్సై పేర్కొన్నారు.