స్పేస్ ఎక్స్ అంతరిక్ష నౌక టెక్సాస్ నుంచి ప్రయోగించిన కొద్ది నిమిషాల్లోనే పేలిపోయింది. స్టార్ షిప్ అంతరిక్ష నౌక ప్రయోగం ఫెయిల్ అయింది. ఈ అంతరిక్ష నౌక పేలుడు దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. నౌక శకలాలు ఫ్లోరిడా, బహమాస్ ప్రాంతాల్లోని ఆకాశంలో తారాజువ్వల్లా కనువిందు చేశాయి.