SKLM: అక్రమంగా ఓ వాహనంలో తరలిస్తున్న 2700 కిలోల పీడీఎస్ బియ్యాన్ని గార మండలం అంపోలు జంక్షన్ వద్ద విజిలెన్స్, రెవెన్యూ అధికారులు బుధవారం రాత్రి పట్టుకున్నారు. డ్రైవర్ పి.వినోద్‌ను విచారించగా నడగాం గ్రామానికి చెందిన పొట్నూరు శ్రీరామ్మూర్తి ప్రజల నుంచి సేకరించిన బియ్యాన్ని కోళ్ల ఫారాలకు సరఫరా చేస్తున్నట్లు తెలిపారు. దీని విలువ రూ.1,22,850 కాగా కేసు నమోదు చేశారు.