Akp: మాజీ సీఎం జగన్‌కు ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ను విమర్శించే అర్హత లేదని జనసేన నర్సీపట్నం నియోజకవర్గ ఇన్ చార్జ్ సూర్యచంద్ర అన్నారు. గురువారం గొలుగొండలో ఆయన మాట్లాడుతూ.. గడిచిన ఎన్నికల్లో ప్రజలు మిమ్మల్ని ఏ స్థాయిలో ఉంచారో తెలుసుకోవాలన్నారు. వైనాట్ 175 అన్న మీ స్థాయి ఈరోజు ప్రజలు ఇచ్చిన తీర్పుతో ఏ స్థాయిలో ఉన్నారో గ్రహించాలని చెప్పారు.