అగనంపూడి పరిధిలోని శనివాడ వేపచెట్టు కూడలి వద్ద ఈ నెల 9వ తేదీ రక్తదాన శిబిరం నిర్వహించనున్నారు. లయన్స్ క్లబ్, ముత్యాల హారం ఫౌండేషన్ల ఆధ్వర్యంలో ఈ శిబిరం ఏర్పాటు చేస్తున్నారు. దాతలు స్వచ్ఛందంగా పాల్గొని రక్తదానం చేయాలని లయన్స్ క్లబ్ ప్రతినిధులు కోరారు.