ATP: రాప్తాడు మండలం బండమీదపల్లెలో ఓ పాల వ్యాపారి విక్రయిస్తున్న పాలు కల్తీవని తేలింది. చిక్కదనం కోసం పాలలో కాస్టిక్ సోడా, మాల్టోడెక్స్ ట్రిన్ కలిపారని ఫుడ్ సేఫ్టీ అధికారిణి తస్లీమ్ తెలిపారు. ఈ మేరకు ప్రయోగశాల పరీక్షలో తేలిందని అన్నారు. సదరు వ్యాపారికి నోటీసులు జారీ చేశామని, నెల రోజుల్లో సమాధానమివ్వకుంటే క్రిమినల్ కేసు నమోదు చేస్తామని పేర్కొన్నారు.