ATP: విద్యాలయాల్లో కామన్ పీజీ ఎంట్రెన్స్ టెస్ట్ రద్దు చేయాలని AISF రాష్ట్ర అధ్యక్షుడు వలరాజు బుధవారం డిమాండ్ చేశారు. అనంతపురం నగర పరిధిలోని శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో ఆయన మాట్లాడారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విద్యార్థుల పట్ల కక్షపూరితంగా వ్యవహరించడం బాధాకరమన్నారు. డిగ్రీ ఆన్ లైన్ విద్యా విధానాన్ని రద్దు చేయాలి.