తెలంగాణ గవర్నర్ తమిళసై సౌందరరాజన్ నేడు శుక్రవారం భద్రాచలంలో జరగనున్న శ్రీరామ పట్టాభిషేకం కోసం గురువారం రాత్రి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుండి మణుగూరు ఎక్స్ ప్రెస్ రైలులో భద్రాచలం క్రాస్ రోడ్డు చేరుకొని, అక్కడి నుండి ఉదయం భద్రాచలం వచ్చారు.
ప్రముఖ పుణ్య క్షేత్రం భద్రాచలంలో (Badrachalam) శుక్రవారం (నేడు 31, ఏప్రిల్) రోజున నిర్వహించనున్న శ్రీరామ పుష్కర సామ్రాజ్య పట్టాభిషేక మహోత్సవానికి తెలంగాణ గవర్నర్ (Telangana Governor) తమిళసై సౌందరరాజన్ రైలులో (Tamilisai Soundararajan) బయలుదేరారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుండి మణుగూరు ఎక్స్ ప్రెస్ రైలులో గవర్నర్ పయనమయ్యారు (Governor started secunderabad Railway station to Badrachalam in Train). కొత్తగూడెం వరకు రైలులో వెళ్లి, అక్కడి నుండి రోడ్డు మార్గంలో గవర్నర్ భద్రాచలం చేరుకున్నారు. గురువారం రాత్రి గం.11.30 సమయానికి సికింద్రాబాద్ నుండి భద్రాచలం రైలు మార్గంలో వెళ్లనున్నట్లు రాజ్ భవన్ ఓ ప్రకటనలో అంతకుముందే తెలిపింది. రాత్రి సికింద్రాబాద్ వచ్చి, శుక్రవారం తెల్లవారుజామున కొత్తగూడెం రైల్వే స్టేషన్ చేరుకున్నారు. భద్రాద్రికి చేరుకొని, శ్రీరాములవారి (Lord Rama) పట్టాభిషేకానికి (Sri Rama Pattabhishekam at Bhadrachalam) హాజరవుతారు. గవర్నర్ తో పాటు రాజ్ భవన్ అధికారులు, సిబ్బంది పాల్గొంటారు. గవర్నర్ రైల్వే స్టేషన్ కు చేరుకున్న, రైలులో ప్రయాణిస్తున్న ఫోటోలను అధికారిక ట్విట్టర్ అకౌంట్ ద్వారా పోస్ట్ చేశారు.
దక్షిణ అయోధ్యగా భాసిల్లుతున్న భద్రాచలంలో సీతారాముల కళ్యాణ మహోత్సవం గురువారం కన్నుల పండువగా జరిగింది. భద్రాద్రి శ్రీరామ నామస్మరణంతో మార్మోగింది. మిథిలా మండపంలో ఉదయం పది గంటల నుండి మధ్యాహ్నం గం.12.45 వరకు కళ్యాణ మహోత్సవం వైభవంగా జరిగింది. వేదమంత్రాల సాక్షిగా అభిజిత్ లగ్నం సమీపించగానే జీలకర్ర – బెల్లాన్ని సీతారాముల శిరస్సుపై ఉంచారు. మాంగల్య ధారణ అట్టహాసంగా సాగింది. శ్రీ రామ నవమికి ముత్యాల తలంబ్రాలను, పట్టువస్త్రాలను ముఖ్యమంత్రి తీసుకు రావడం సంప్రదాయం. కానీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈసారి కూడా హాజరు కాలేదు. దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, కమిషనర్ అనిల్ అగర్వాల్ ప్రభుత్వం తరఫున సీతారాములకు పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. ఈ వేడుకల్లో హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ, ఏపీ శాసన సభాపతి తమ్మినేని సీతారాం, హైకోర్టు న్యాయమూర్తులు, ఎంపీలు వద్దిరాజు రవిచంద్ర, మాలోత్ కవిత తదితరులు పాల్గొన్నారు.