VSP: గీతం యూనివర్సిటీలో మార్చి 5, 6 తేదీలలో కెరీర్ ఫెయిర్ నిర్వహించనున్నారు. ఏపీ ఉన్నత విద్యా మండలి నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో దీనిని నిర్వహిస్తున్నారు. సుమారు 49ఐటి కంపెనీలలో 10వేల ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని మంత్రి నారా లోకేష్ వెల్లడించారు. ఈ సందర్భంగా పోస్టర్ విడుదల చేశారు. 2024-25లో పాస్ అయిన వారు మార్చి 3లోపు రిజిస్టర్ చేసుకోవాలని సూచించారు.