TG: శ్రీశైలం ఎడమ కాలువకు సంబంధించిన టన్నెల్లో ప్రమాదం జరిగింది. టన్నెల్ 14వ కి.మీ దగ్గర మూడు మీటర్ల మేర పైకప్పు కుంగిపోయింది. ఈ ఘటనలో పలువురు కార్మికులు గాయపడగా.. మరికొందరు టన్నెల్లో చిక్కుకుపోయినట్లు తెలుస్తోంది. అధికారులు ఘటనాస్థలం వద్దకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. కాగా.. ఈ ప్రమాదానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.