బాపట్ల: చీరాల మండలం కావూరివారిపాలెం పరిసర ప్రాంతాల్లోని పొలాల్లో నీటి మోటర్ల దొంగతనాలకు పాల్పడిన ఇద్దరు నిందితులను చీరాల రూరల్ పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. నిందితుల వద్ద నుంచి 5 నీటి మోటార్లను స్వాధీనం చేసుకున్నారు. చెడు వ్యసనాలకు బానిసై దొంగతనాలకు పాల్పడుతున్నారని, నిందితులను కోర్టులో హాజరుపరచనున్నట్లుగా ఈపురుపాలెం ఎస్సై చంద్రశేఖర్ తెలిపారు.