VZM: టాయిలెట్లు లేకుండా ఉన్న ప్రైవేటు భవనాల్లో ఉంటున్న అంగన్వాడీ కేంద్రాలను ఖాళీ చేసి వారంలోగా కొత్త భవనాల్లోకి మార్చాలని కలెక్టర్ అంబేద్కర్ ఆదేశించారు. శుక్రవారం కలేక్టరేట్ ఆడిటోరియంలో ICDS అధికారులతో సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఉండి టాయిలెట్ లేని వారికి, అదే విధంగా విద్యుత్ సరఫరా లేని భవనాల జాబితాలను అందించాలన్నారు.