KKD: నగరపాలక సంస్థ కమిషనర్ భావన శుక్రవారం కాకినాడ బీచ్‌ను సందర్శించారు. జరుగుతున్న బీచ్ అభివృద్ధి పనులను పరిశీలించారు. ఇటీవల టూరిజం మంత్రి దుర్గేశ్ బీచ్ పరిశీలించి అభివృద్ధికి హామీ ఇచ్చారు. కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఇక్కడ జరుగుతున్న పనులను పరిశీలించారు. పనులు మరింత వేగవంతం చేయాలని ఆదేశించారు.