BDK: బతికి ఉన్న తనను చనిపోయినట్లు చిత్రీకరించి రూ.10లక్షలు మాయం చేశారని భుక్యా శ్రీరాములు అనే వ్యక్తి ఆరోపించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం భాస్కర్ నగర్‌కు చెందిన ఆయన తనను ఒకరు మోసం చేసి, డెత్ సర్టిఫికెట్ క్రియేట్ చేసి రూ.10లక్షల బీమాను తన భార్య పేరు మీద అక్రమంగా కాజేశారని ఆవేదన వ్యక్తం చేశాడు. రాయల దుర్గారావుపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.