TG: మధ్యప్రదేశ్లోని జబల్పుర్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటనలో హైదరాబాద్లోని నాచారం ఏరియాకు చెందిన 8 మంది చనిపోయినట్లు సమాచారం అందటంతో.. వెంటనే అధికారులను అప్రమత్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందేలా ఏర్పాట్లు చేయాలని, అవసరమైన సహాయక చర్యలు త్వరిగతిన చేపట్టాలని సీఎం ఆదేశించారు.