»Pope Francis In Hospital With Respiratory Infection
Pope Francis in hospital: శ్వాస సంబంధిత బాధతో ఆసుపత్రిలో చేరిన పోప్ ఫ్రాన్సిస్
పోప్ ఫ్రాన్సిస్ శ్వాస సంబంధిత బాధతో ఆసుపత్రిలో చేరారు. ఆయన వయస్సు 86. ఆయన అస్వస్థతతో బుధవారం రాత్రి ఆసుపత్రిలో చేరాడని, శ్వాస సంబంధిత ఇన్ ఫెక్షన్ తో బాధపడుతున్నాడని, దీంతో రోమ్ లోని జెమెల్లీ ఆసుపత్రిలో చేరినట్లు వాటికన్ సిటీ వర్గాలు వెల్లడించాయి.
పోప్ ఫ్రాన్సిస్ శ్వాస సంబంధిత బాధతో ఆసుపత్రిలో చేరారు. ఆయన వయస్సు 86. ఆయన అస్వస్థతతో బుధవారం రాత్రి ఆసుపత్రిలో చేరాడని, శ్వాస సంబంధిత ఇన్ ఫెక్షన్ తో బాధపడుతున్నాడని, దీంతో రోమ్ లోని జెమెల్లీ ఆసుపత్రిలో చేరినట్లు వాటికన్ సిటీ వర్గాలు వెల్లడించాయి. ఆయనకు ఎలాంటి కోవిడ్ లేదని డాక్టర్లు చెప్పినట్లు తెలిపింది. మరికొన్ని రోజులు ఆయన ఆసుపత్రిలోనే ఉంటారని తెలుస్తోంది. గత కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో ఏడాది కాలంగా పలు ముఖ్య కార్యక్రమాలకు గైర్హాజరవుతున్నారు. ఆరోగ్యం బాగా లేదని తెలిసి పోప్ ఫ్రాన్సిస్ కు పెద్ద ఎత్తున త్వరగా కోలుకోవాలంటూ సందేశాలు వస్తున్నాయి. సెక్యూరిటీ సహా పోప్ దగ్గరి స్టాఫ్ అంతా కూడా బుధవారం రాత్రి అంతా జెమెల్లీ ఆసుపత్రిలోనే ఉన్నారు.
ఈస్టర్ నేపథ్యంలో ఆయన పలు కార్యక్రమాలను ఏర్పాటు చేసుకున్నారు. ఏప్రిల్ నెల చివరలో హంగేరీ వెళ్లవలసి ఉంది. బుధవారం ఉదయం ఆయన పీటర్స్ స్క్వేర్ లో సాధారణ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. అయితే ఆ తర్వాత వాహనం ఎక్కే సమయంలో కాస్త ఇబ్బందిగా కనిపించారు.
తొలుత వాటికన్ వర్గాలు పోప్ గత షెడ్యూల్ ప్రకారం చెకప్ కోసం ఆసుపత్రికి వెళ్లినట్లు వెల్లడించాయి. అయితే ఇటాలియన్ మీడియా టెలివిజన్ ఇంటర్వ్యూ రద్దు చేయబడటంతో ప్రశ్నలు తలెత్తాయి. దీంతో ఆయన ఆసుపత్రిలో చేరారని, ఆయన కోలుకోవడానికి ప్రార్థనలు చేయాలని ప్రజలను కోరింది. అర్జెంటీనాలోని పోప్ స్వస్థలమైన బ్యూనస్ ఎయిర్స్ లో ఆయన వైద్య సహాయంతో కోలుకోవాలని ప్రజలు ప్రార్థనలు చేశారు. 2021లోను పెద్ద ప్రేగు సమస్యకు ఆపరేషన్ చేయించుకున్నారు.