SRCL: చందుర్తి మండల బీసీ సాధికారిత సంఘం మండల అధ్యక్షులుగా ముద్ర కోల వెంకన్న నియామకమయ్యారు. ఈ మేరకు వేములవాడలో గురువారం జరిగిన సమావేశంలో సంఘం గౌరవాధ్యక్షులు కొండ దేవయ్య, ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్షులు పొలాస నరేందర్‌లు వెంకన్నకు నియామక పత్రం అందజేశారు. బీసీల హక్కుల కోసం పోరాడనున్నట్టు నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన వెంకన్నకు అభినందనలు తెలిపారు.