ADB: జన్నారం మండలంలోని పలు గ్రామాలలో వానాకాలం సీజనుకు సంబంధించి అమ్మిన ధాన్యానికి బోనస్ డబ్బులను బ్యాంకు ఖాతాలలో వేయాలని రైతులు కోరారు. సన్న వడ్లు పండించిన రైతులకు ప్రభుత్వం క్వింటాలుకు రూ.500 చొప్పున బోనస్‌ను ఇస్తామని ప్రకటించింది. ధాన్యం అమ్మి రెండు నెలలు కావస్తున్న తమకు బోనస్ డబ్బులు రాలేదని రాంపూర్, తిమ్మాపూర్, తపాలాపూర్ గ్రామాల రైతులు వాపోయారు.