JGL: ఎండపల్లి మండలం గుల్లకోట గ్రామంలో బిసగోని గంగయ్య ఇంటి ఆవరణలో బుధవారం మంచినీళ్ల బావిలో పడి వేదాన్ష్(3) అనే బాలుడు మృతి చెందాడు. గ్రామానికి చెందిన మంతెన శిరీషా-రంజిత్ దంపతుల చిన్న కుమారుడైన వేదాన్ష్ ఆడుకుంటూ వెళ్లి ప్రమాదవశాత్తు బావిలో పడి మృతి చెందాడు. తల్లి బాలుని ఆచూకీ కోసం గాలిస్తుండగా బావిలో శవమై తేలాడు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.