ATP: పెద్దపప్పురు మండలం చిన్నపప్పురులో అశ్వర్థ నారాయణ స్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఆదివారం అర్థ రాత్రి నుంచే అశ్వర్థ నారాయణస్వామి, శ్రీ చక్ర భీమలింగేశ్వర స్వామివారికి అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు. స్వామివారిని వివిధ పూలతో అలంకరించి, భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. స్వామివారి దర్శనం కోసం ప్రత్యేక క్యూ లైన్లో భక్తులు బారులు తీరారు.